100 కోట్ల ఓటిటి డీల్ కు నో చెప్పిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా మూడువంతుల భాగo షూటింగ్ లాక్ డౌన్ కు ముందే పూర్తి చేసుకుంది. మరో నెల రోజులు షూట్ చేస్తే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తవుతుంది.  అందులో పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కు ఈ చిత్రం రీమేక్ అన్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం. పవర్ స్టార్ అభిమానుల్లో ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజమే.

అయితే గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుంది అంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. అమెజాన్ ప్రైమ్ కళ్ళు చెదిరే ఆఫర్ తో వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ ను చేజిక్కించుకోవాలని చూసింది. దాదాపు 100 కోట్ల రూపాయలను దిల్ రాజుకు ఆఫర్ చేయాలనుకుంది ప్రైమ్. నిజానికి వి సినిమా కంటే ముందే అమెజాన్ ప్రైమ్ ఈ భారీ ఆఫర్ తో దిల్ రాజును సంప్రదించింది.

దిల్ రాజు ఈ ఆఫర్ పట్ల ఆకర్షితుడు అయినా పవన్ కళ్యాణ్ నో చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే పవన్ క్రేజ్ కు 100 కోట్లు వసూలు చేయడం అనేది పెద్ద విషయమేం కాదు. ప్లాప్ టాక్ తెచ్చుకున్న అజ్ఞాతవాసి సినిమాతోనే దాదాపు 60 కోట్లు రాబట్టారు పవన్. అందుకే వకీల్ సాబ్ ఓటిటి డీల్ కు నో చెప్పారని టాక్ నడుస్తోంది.