వెదురు కుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి: జనసేన నిరసన

  • తుడా పరిధిలో ఉన్న వెదురుకుప్పం తిరుపతి జిల్లాకి పనికి రాదా?
  • మంత్రి పెద్దిరెడ్డి రెండు మండలాలను కలిపినప్పుడు, ఉపముఖ్యమంత్రి ఒక మండలాన్ని కలపలేడా?
  • రోజా చేసిన పనిని స్వామీ చేయలేడా?
  • చెవిరెడ్డి చేసిన సాహసం, నారాయణ స్వామి ఎందుకు చేయలేడు?
  • ఉపముఖ్యమంత్రి ముమ్మాటికీ అసమర్ధుడే
  • జనసేన ఇంచార్జి యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: వెదురుకుప్పం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద జనసేన, బిజెపి ఆధ్వర్యంలో వెదురు కుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ధర్నా నిర్వహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ మాట్లాడుతూ తుడా పరిధిలో వెదురుకుప్పం 32 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఈ మండలం తిరుపతి జిల్లాకి పనికి రాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు పదవులున్న మంత్రి పెద్దిరెడ్డి రొంపిచర్ల, పులి చర్ల మండలాలను తిరుపతిలో కలిపినప్పుడు అదే జిల్లాలో మూడు పదవులు ఉన్న ఉపముఖ్యమంత్రి ఒక మండలాన్ని కలపలేడా? అని ఆగ్రహం వ్యక్తం చేసాడు. రోజా చేసిన పనిని స్వామీ చేయలేడా? అని చెవిరెడ్డి చేసిన సాహసం, నారాయణ స్వామి ఎందుకు చేయలేడని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అందుకే
ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ముమ్మాటికీ అసమర్ధుడే అని నొక్కి వక్కాణించారు. ఒక వారంలో ఉమ్మడి కార్యకర్తల ప్రణాళిక ప్రకటిస్తామని, వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపేంత వరకు విరోచితమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. మండల ప్రజలందరినీ యఏకం చేసి, ప్రజలందరిని అప్రమత్తం చేసి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించి సామూహిక ధర్నాలకు సిద్ద పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, బిజెపి మండల అధ్యక్షులు తిరుమల ఆచారి, జనసేన యతీశ్వర్ రెడ్డి, వెదురు మండల యువజన అధ్యక్షులు సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబెర్ హనుమంత్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గోవింద రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు తులసిరామ్, ప్రధాన కార్యదర్శి రషీద్, జనసేన మండల కార్యదర్శి సాయికుమార్, జనసేన మండల కార్యదర్శి బెనర్జీ, జనసైనికులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.