పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవలు చేస్తున్నాం

రాజోలు, కష్టకాలంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన రాజోలు నియోజకవర్గంలో పొదలాడ గ్రామానికి చెందిన జనసైనికుడు పంచదార చిన్నబాబుకి గటిగంటి వాసు కళ్యాణమండపం వాడ్రేవుపల్లిలో రాజోలు తాలూకా ఏ1 సేవాసమితి సభ్యులు చెల్లుబోయిన శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చినబాబు మాట్లాడుతూ నాకు సహాయసహకారాలు అందించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో స్థానికులు, పలువురు పెద్దలు పాల్గొన్నారు.