క‌రోనాపై పోరుకు భార‌త్‌కు సాయం చేస్తాం: ఫౌచీ

భార‌త్‌లో క‌రోనా కేసులు ప్ర‌తిరోజు మూడు ల‌క్ష‌ల కంటే అధికంగా న‌మోద‌వుతోన్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై అమెరికా స్పందించింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం భారత్ చేస్తున్న పోరాటానికి తాము సాయం అందిస్తామని చెప్పింది. భారత్‌కు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ద్వారా సాంకేతిక సహకారం అందిస్తామ‌ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు అంథోనీ ఫౌచీ ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌రోవైపు, కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో భారత్‌కు సాయం చేయాలని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ దేశ‌ చట్టసభ సభ్యులు, పలువురు భార‌త సంత‌తి అమెరిక‌న్లు  ఇండియాకు సాయం చేయాల‌ని బైడెన్ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. క‌రోనా వ్యాక్సిన్ల‌తో పాటు వైద్య సామగ్రిని సరఫరా చేయాలని చెబుతున్నారు.