‘నా ఆరాధ్య దైవం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్’ గారి ఆశీస్సుల తో

పవర్ స్టార్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. పవన్ కొత్త సినిమా వస్తుంది అంటే సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్లలో విడుదల అయ్యి వెళ్ళే వరకు కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తారు. పవన్ యూత్ కోసం చెప్పే మాటలు అన్నీ కూడా వారిని మరింత ఆకర్షిస్తాయి. పవన్ స్థాపించిన జనసేన పార్టీ పై యువతకు చాలా అభిమానం ఉంది. గతఎన్నికల ముందు జనసేన పార్టీ ప్రచారం కోసం ఓ అభిమాని తన పెళ్ళికి పంచిన పత్రికల లో పెళ్లి కి వచ్చిన వారంతా ఎన్నికల్లో తన దేవుడు పవన్ ను గెలిపించాలనికోరారు.

తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది.. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం చిన్ననగమయ్య పాలెం గ్రామానికి చెందిన జన సైనికుడు రాజు తన పెళ్లి పత్రికను జనసేన పార్టీ కరపత్రంగా మార్చేశాడు.పత్రిక లోపల పార్టీ సిద్ధాంతాలు కూడా ముద్రించాడు. ‘నా ఆరాధ్య దైవం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్’ గారి ఆశీస్సుల తో అంటూ బంధు మిత్రులను తన వివాహానికి ఆహ్వానించాడు. రాజు చేసిన పనికి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ముచ్చట పడ్డారు. భీమిలి జనసేన పార్టీ నేత సందీప్ పంచకర్ల స్వయంగా రాజు వివాహానికి హాజరై నూతన వధూవరులను అభినందించారు.