వైసీపీ నేతల కన్నా తోడేళ్ళు నయం

  • ఇసుక, ఇటుక కనిపిస్తే గద్దల్లా వాలుతున్న కార్పొరేటర్లు
  • కమల్ హాసన్ కి మించి నటించటం మినహా నియోజవర్గానికి ముస్తఫా చేసింది ఏమీలేదు
  • మౌళిక సదుపాయాలు కల్పించటంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం
  • క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం
  • జనసేనకు అధికారం ఇస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తాం
  • సమస్యలపై జనసేన సమరభేరి కార్యక్రమంలో గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ఇసుక, ఇటుక కనిపిస్తే చాలు కార్పొరేటర్లు గద్దల్లా వాలిపోతారు, ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా సీ ట్యాక్స్ (కార్పొరేటర్ ట్యాక్స్) కట్టాల్సిందే అంటూ ప్రజల్ని రాంబందుల్లా పీక్కుతింటున్నారు. డబ్బులు కట్టని వారిపై సచివాలయం సిబ్బందిని పంపి నిర్మాణాన్ని ఆపిస్తున్నారు. వైసీపీ నేతల కన్నా తోడేళ్ళు నయం అంటూ జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై జనసేన సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 13వ డివిజన్ లో పర్యటించారు. డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మంత్రి వారి వీధి, చౌత్రా సెంటర్, మంచం బజారు, దర్గా సెంటర్, ఒడ్డెర కాలనీ లలో పర్యటించి ప్రజల్ని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. సరైన రోడ్లు, సైడు కాలువల నిర్మానాలు చేపట్టకపోవడం తో పాటూ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై చేరడంతో నరకయాతన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు స్థానిక కార్పొరేటర్ కు, సచివాలయం సిబ్బందికి చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. కన్యకాపరమేశ్వరి దేవస్థానం నుంచి పొన్నూరు రోడ్డుకి వేసిన సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని, రోడ్డు వేసిన నెలకే పగుళ్లు వచ్చాయని ప్రజలు పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించటంలో వైసీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. చేసిన కాస్తో కూస్తో పనుల్లో కూడా అవినీతి పెద్దఎత్తున జరగటం శోచనీయం అన్నారు. స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించారని దుయ్యబట్టారు. కమల్ హాసన్ తరహాలో నటన మినహా ముస్తఫా వల్ల తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. స్థానిక కార్పొరేటర్ కు మాటలు తప్ప చేతల్లేవని మండిపడ్డారు. డివిజన్ లో అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నా, పారిశుద్ధ్య లేమితో ప్రజలు అల్లాడుతున్న కార్పొరేటర్ కు చీమకుట్టినట్లుగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయని రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజల చేతిలో ఘోర పరాభవం తప్పదన్నారు. ప్రజలు ఆశీర్వదించి జనసేనకు పట్టం గడితే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తామని నేరేళ్ళ సురేష్ తెలిపారు. తొలుత స్వర్గీయ మంత్రి రాంబాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లికా, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, జనసేన పార్టీ మహిళా నాయకురాలు పాకనాటి రమాదేవి, నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, నగర ప్రధాన కార్యదర్శులు సూరిశెట్టి ఉపేంద్ర, చామర్తి ఆనంద్ సాగర్, నగర్ కార్యదర్శులు తోట కార్తీక్, బండారు రవీంద్ర కుమార్, పావులూరి కోటేశ్వరరావు, మల్లేశ్వరి, అరుణ, నగర సంయుక్త కార్యదర్శి పులిగడ్డ గోపి, ఎడ్ల రాధిక, నాగేంద్ర సింగ్, కొత్తకోట ప్రసాద్, కొడిదేటి కిషోర్, మరియు జనసేన పార్టీ వీర మహిళ అనసూర్య, రాజనాల నాగలక్ష్మి, మిద్దె నాగరాజు, కోసూరి భాను, డివిజన్ అధ్యక్షులు, గడ్డం రోశయ్య, మాదాసు శేఖర్, జడ సురేష్, కొలసాని బాలకృష్ణ, సర్ఫుద్దీన్, చెన్నం శ్రీకాంత్, పవన్ వెంకీ, దాసరి వెంకటేశ్వరరావు, పసుపులేటి నరసింహారావు, శాంతి కుమార్, షేక్ రజాక్, ఏడుకొండలు, గుర్రాల ఉమామహేశ్వరరావు, మరియు 13వ డివిజన్ పెద్దలు, జిడుగు వెంకట సురేష్ బాబు,బడే రామకృష్ణ, రాజనాల సత్యనారాయణ, రాజనాల శివ ఆంజనేయులు, నాగళ్ళ సుబ్రహ్మణ్యం, రాజనాల ప్రసాదు, గౌరీ శేఖర్, మంత్రి రాహుల్, కొలసాని శివనాగేశ్వరరావు, సాయి లక్కీ, మరియు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.