గాంజాయి మత్తులో రేణిగుంట యువత – మహిళల ఆవేదన!!

  • జనసేన విజయ యాత్ర – ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – 43వ రోజు
  • 43వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

రేణిగుంట పట్టణం, జి.యం స్ట్రీట్, భజన గుడి వీధిలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. పట్టణంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. త్రాగు నీటి సమస్యతో 2 నెలలుగా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదని, డ్రైనేజ్ కాలువలు అస్సలు శుభ్రం చెయ్యడం లేదని, స్ట్రీట్ లైట్ లేవని, యువత గాంజాయి సేవిస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్నారని పోలీసులు అరికట్టే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ ఇంఛార్జి శ్రీమతి భాగ్య లక్ష్మి, మండల ఇంఛార్జి చిన్న తోట నాగరాజు, ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు నగరం భాస్కర్ బాబు, పార్థ సారథి, అనురాధ, శ్రీనివాసులు, లోకేష్, త్యాగరాజు, ఉమా మహేశ్వరి, దండి రాఘవయ్య, తోట గణేష్, కావలి శివకుమార్, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్, చిన్న మునయ్య, రాజేష్, సురేష్, గురవయ్య, జనసైనికులు గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.