వైఎస్ఆర్ సీపీకి గుడ్ బై చెప్పి పలువురు నేతలు, కార్యకర్తలు

  • రాజానగరం నియోజకవర్గంలో తుడిచిపెట్టుకుపోతున్న వైఎస్ఆర్సిపి
  • రాజానగరం నియోజకవర్గంలో “బత్తుల” సమక్షంలో జనసేన పార్టీలో నిర్విరామంగా కొనసాగుతున్న చేరికలు
  • కలవచర్ల గ్రామంలో కనుల పండుగ”లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
  • ఊరువాడ జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవంలో భాగంగా.. “కలవచర్ల” గ్రామంలో పలుచోట్ల జెండా స్థూపం ఆవిష్కరణలు
  • జనసంద్రంగా, జననీరాజనాలతో “బత్తుల” కు బ్రహ్మరథం పట్టిన కలవచర్ల’ గ్రామ ప్రజానీకం
  • రాజానగరం నియోజకవర్గంలో జీరో అవుతున్న వైసిపి
  • కలవచర్ల గ్రామంలో వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్న 100 కుటుంబాలు
  • ప్రతిరోజు జనసేన పార్టీలో కొనసాగుతున్న భారీ చేరికలు.. అయోమయంలో వైసీపీ శ్రేణులు
  • గ్యాప్ లేకుండా వరుస జాయినింగ్స్ తో జనసేన కంచుకోట గా రాజానగరం నియోజకవర్గం
  • కలవచర్ల గ్రామంలో పండగ వాతావరణం.. యువకుల కేరింతలతో, మహిళల, పెద్దల ఆశీస్సులతో “బత్తుల” కు గ్రామంలో ఘనస్వాగతం
  • బత్తులతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాడని, బత్తుల నాయకత్వానికి పట్టం కట్టడానికి స్వచ్ఛందంగా ముందు వస్తున్న ప్రజలు. పవనన్నపై నమ్మకం
  • “బలరామన్న”పై భరోసా
  • రాజానగరం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీగా దిశగా జనసేన పార్టీ
  • రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి చూపు ఈసారి “గాజు గ్లాసు” పైనే
  • రాజానగరం నియోజకవర్గంలో వైసిపి అరాచక, అవినీతి, అసమర్థ పాలనపై విసుగుచెంది జనసేనలోకి క్యూ కడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీలో నూతన ఉత్సవం.. గెలుపు మాదేనంటున్న జనశ్రేణులు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కలవచర్ల వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వైసీపీకి చెందిన 109 కుటుంబాలు రాష్ట్రంలో, రాజానగరం నియోజకవ్గంలో వైసీపీ పాలన పట్ల, నేతల తీరు పట్ల విసుగుచెంది, విరక్తి కలిగి.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలు, రాజకీయ లక్ష్యాలు.. అలానే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ అవిశ్రాంతంగా జనసేన పార్టీ ఉన్నతికి శ్రమిస్తున్న తీరు.. బడుగు బలహీన వర్గాలకు చేయూతనందిస్తున్న పలు సేవా కార్యక్రమాలు, పేదల పక్షాన పోరాడుతున్న తీరు, వైసిపి అరాచక, అవినీతి, అసమర్థతను ఎండగడుతున్న తీరుకు ఆకర్షితులై.. బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన నల్లమోలు చిన్నవీర్రాజు, స్టూడియో శ్రీనివాస్, చల్లా వీరబాబు, కాళ్ళ రామరాజు పెద్ద నేతలను జనసేన పార్టీలోకి కండువా వేసి సాధారంగా పార్టీలో ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన కండువా వేసి సాధారంగా పార్టీలో ఆహ్వానించారు. అంతకుముందు కలవచర్ల గ్రామంలో “ఊరువాడ జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవంగా భాగంగా పలుచోట్ల జనసేన జండా స్థూపాలను ఆవిష్కరించిన అనంతరం నూతనంగా నిర్మితమైన జనసేన పార్టీ కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణలతో, భారీగా తరలివచ్చిన శ్రేణుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు బత్తుల బలరామకృష్ణ. నూతన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సభ వేదిక వద్ద వైసీపీకి చెందిన 100 కుటుంబాలు బత్తుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వారి స్థాయికి తగ్గట్టు తగిన గౌరవం, గుర్తింపు ఇస్తామని, క్రమశిక్షణగా పనిచేస్తూ, అందర్నీ కలుపుకుంటూ ముందుకెళ్లే నాయకులకు ఖచ్చితంగా జనసేన పార్టీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, రాబోవు ఎన్నికల్లో వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ నిర్మించడానికి, జనసేన- టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ సమైక్యంగా, సంఘటతంగా శ్రమించాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నియోజకవర్గ వాసిగా నియోజకవర్గ నడిబొడ్డున ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ కష్టం వస్తుందని వెంటనే తనకు ఫోన్ చేస్తే 24 గంటలు అందుబాటులో ఉంటానని, నియోజవర్గంలో బంధువులు స్నేహితులు చిన్ననాటి నుండి పరిచయాలు మీలో ఒకడిగా ఆదరించిన నన్ను ఈ అభిమానం ఇలానే కొనసాగించాలని తాను డబ్బు కోసం పేరు కోసం కాకుండా కేవలం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అందుకే తన దగ్గరున్న ఆస్తిలో కొంత భాగాన్ని ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా వినియోగిస్తున్నానని అందరూ ఆలోచించి ఆశీర్వదించి తనకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని కచ్చితంగా చేసి తీరుతానని ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కలవచర్ల గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.