రాజరత్న నగర్ లో హక్కు కోసం యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో స్థానిక 9వ డివిజన్ రాజరత్న నగర్, హంసవరం అప్పన్న వీధి సమీపంలో ములికి అప్పన్న ఆధ్వర్యంలో సొంత ఇల్లు కావాలి హక్కు కోసం యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటూ ఎన్నికల ముందు ఒక యుద్ధ వాతావరణంతో భయబ్రాంతులని చేసి నెగ్గడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతిగా మేముకూడా సిద్ధం అనే కార్యక్రమాన్ని కాకినాడ సిటిలో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాకినాడలోని పేదప్రజలకు సొంత ఇల్లు అనేది ఒక హక్కు కావాలనీ, ఆహక్కు కోసం జనసేనపార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి జనసేన సిద్ధం అనీ అంతేకానీ రాష్ట్రంలో దౌర్జన్యాలకి, అరాచకాలకీ సిద్ధం అంటే కుదరదన్నారు. ప్రభుత్వం ఏమి చేసినా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనీ కాకినాడ నగరంలో ఈవేళకి కూడా ఎంతోమందికి ఇళ్ళు లేవు ఇంకా అద్దే ఇళ్ళలో ఉంటున్నారు, ఈప్రాంతంలో పదిహేను సంవత్సరాలక్రితం ఇచ్చిన పట్టాలు తప్ప కొత్తగా ఇచ్చిన పట్టాలు లేవు అనీ, జనసెన పార్టీ కాకినాడలో అద్దె ఇళ్ళలో ఉంటున్న పేదప్రజల ప్రతి ఒక్కరికీ కాకినాడలోనే ఇల్లు ఇవ్వడానికి కంకణంకట్టుకుందని హామీ ఇచ్చారు. కాకినాడలోని పేదప్రజలకు సొంతిల్లు ఒక హక్కుగా మార్చేందుకు జనసేన సిద్ధం అనీ దానికి మేము సిద్ధం అని నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, ములికి అప్పన్న, పెద్దిరెడ్డి ఉదయభాస్కర్, మండపాక దుర్గాప్రసాద్, వెంకట అప్పారావు, బూర వెంకన్న, ఆదిబాబు, దుర్గ, బర్రే నాగేశ్వర్రావు, నక్కా నాగేశ్వర్రావు, గోవిందు, నవీన్, దుర్గారావు, కాంటా రవిశంకర్, సమీరు, మిరియాల హైమవతి, బట్టు లీల, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు.