బత్తుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీకి చెందిన 100 కుటుంబాలు జనసేనలో చేరిక

రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో వరుస చేరికలతో దూసుకుపోతున్న జనసేన పార్టీలోకి గురువారం.. కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన… వైసిపి కి చెందిన 100 కుటుంబాలు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మీ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. వారందరికీ పార్టీలోకి స్వాగతం పలుకుతూ జనసేన కండువా వేస్తూ ఆహ్వానించారు… గ్రామంలో ముందుగా తీన్మార్ డబ్బులతో, బాణసంచా పేల్చుతూ జనసైనికుల కేరింతలతో ఊరేగింపుగా వచ్చి ముందు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు అర్పించి జోహార్లు పలికారు..! వైసిపి నుండి జనసేన పార్టీ జాయిన్ అయినవారు పల్ల వీర్రాజు, పుప్పాడ నాగేశ్వరరావు, కురుమళ్ళ సూరిబాబు, బెల్లం నాగు, పితాని నాని, పితాని శ్రీను, కర్రి ఏసు, కట్టా శ్రీను, నక్కి సుబ్బారావు, నక్కి అప్పారావు, నైదాని రాజు, లక్ష్మి సత్యనారాయణ, కురుమళ్ళ గణేష్, కాన సూరిబాబు, కొట్టు రాజు తదితర వైసీపీ పార్టీకి చెందిన 100 కుటుంబాలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు.. పూర్తిగా అసమర్థ పాలన చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన జగన్ సర్కార్ తీరుకు పూర్తిగా విసుగు చెంది, అసహనంతో పార్టీని విడాలని నిర్ణయించుకుని… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం, ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు, దానధర్మాలు, పార్టీ ఆశయాలు నచ్చి… అలానే రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ చేస్తున్న పలు సేవాకార్యక్రమాలు, రాత్రింబవళ్లు పార్టీని అభివృద్ధి చేస్తున్న తీరుకు మెచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. ఈ కార్యక్రమంలో కట్టా వెంకన్నబాబు, పుప్పాల ప్రసాద్,కడిం బార్గవ, ఈపి రాజు, కట్టా పోలీస్, పులపర్తి పట్టాభి, పులగం వీరబాబు, కట్టు గంగాధర్, కట్టు శ్రీను, కురుమళ్ళ సాయి, నియోజకవర్గ సీనియర్ నేతలు అడ్డాల శ్రీను, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, వేగిసెట్ రాజు, తోట అనిల్ వాసు, చిట్టిప్రోలు సత్తిబాబు, దొడ్డి అప్పలరాజు, దేవన దుర్గాప్రసాద్, బొల్లెద్దుపాలెం గ్రామ పెద్దలు, జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు..!!