ఘనంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

విశాఖపట్నం,88వ వార్డు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 51 వ జన్మదిన సందర్భంగా జెర్రీపోతుల పాలెం కోలనీ యందు జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ మరియు నాసేన నా వంతు అనే కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉండే సమయం వచ్చిందని.. మనందరం రామాయణంలో శ్రీ రాముడికి ఉడతా ఏ విధంగా సహాయం చేసిందో ఈనాటి మన పవన్ కళ్యాణ్ గారికి మనందరం ఆర్థికంగా బలాన్ని చేకూర్చాలని కోరడం జరిగింది. వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని.. కావున మంచి పాలన కోసం అధ్యక్షులు వారికి ఆర్థిక పరమైన విషయాలపై వెసులుబాటు కల్పించే కార్యక్రమంలో మన వంతు బలాన్ని ఇవ్వాలని, పవన్ రావాలి పాలన మారాలి అన్నదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోవడం జరిగింది.
ఈ వేడుకలలో బాఘంగా అజనగిరి గ్రామంలో నాయకులు గోపి, ప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మెడికల్ క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని దాతలకు సర్టిఫికెట్స్ అందించడం జరిగింది, యాదవ్ జగరాజుపేట గ్రామంలో నాయకులు చలం, చిన్నరావు, అశోక్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, జండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక నియోజవర్గం ఇంచార్జ్ కోన తతారావు పాల్గొని ఈరోజు ఈ గ్రామంలో జండా ఎగిరిందని రాబోయే రోజుల్లో అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన జెండాను ఎగరవేస్తారని ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. తిప్పల రమణారెడ్డి మాట్లాడుతూ.. తప్పకుండా మీ అందరి కష్టం రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందని కలిసికట్టుగా పని చేద్దామని కోరడం జరిగింది. నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ గ్రామంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల నడుస్తూ.. జనసేన పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలో చాలామందికి స్ఫూర్తిగా ఉంటున్నారని, ఈ గ్రామం జనసేన పార్టీకి చాలా ప్రత్యేకమైనదని.. మీ అందరికీ ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాల్లో కాదా శీను, గల్లా శ్రీను, పెంటరావు గోపి, రవిబాబు, తేజ, శ్యాము, లింగం, వాసు, శంకర్రావు, అశోక్ మరియు జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *