పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం 17వ రోజు

వైజాగ్ ఈస్ట్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో విశాఖ తూర్పు నియోజకవర్గం, 15వ వార్డు జనసేన నాయకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో గత 17 రోజులుగా దిగ్విజయంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ 15వ వార్డులో ఈ వేసవి కాలంలో ఎంతోమంది దాహం తీర్చడానికి పూనుకొని గత 17 రోజులుగా ప్రతిరోజు మజ్జిగ పంచుతూ ధన సమయ వ్యయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తూ జనసేన అభివృద్ధిలో నేను ఒక భాగస్వామి అవ్వడానికి నాకు ఈ రోజు సహకరించిన కొండలరావు గారికి మరియు 17వ వార్డు శ్రీనివాస్ పట్నాయక్, సాయి గారికి మరియు 18వ వార్డు చిన్న రావు రాజులకు మరియు 22వ వార్డు శ్రీనివాస్ గారికి మరియు ఐ.టీ శ్రీనివాస్ గారికి మరియు 11వ వార్డు విక్రమ్ బాబు, నగేష్, శ్యాం ప్రసాద్ గారికి అలాగే సీరపు శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని సాయిబాబా తెలిపారు.