జనసేన పోరుబాట 19 వ రోజు పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నామని రెడ్డి అప్పల నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను దోపిడీ విధానాలను సైతం ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు. 19వ డివిజన్ బూరాయడెంలో గతంలో నేను ఎంపిపిగా, ఎంపిటిసిగా, వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాను. తరువాత వచ్చిన పాలకులు ఎవరు కూడా ఇటువైపుగా చూసిన దాఖలాలు లేవు..ఓ వైపు మంచినీటి సమస్య, రోడ్లు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నాయి.ఇప్పటికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వారికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద హౌసింగ్ లోన్ సౌకర్యాలు కల్పించి తక్షణమే రుణ సదుపాయం ఇప్పించవలసిందిగా అధికార ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఊరికి శివారులో ఉన్న ప్రాంతంగా ఎటువంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వెనుకబడి ఉన్నందున సదరు విషయం సంబంధిత అధికారుల ద్వారా అధికార పార్టీ వారికి తెలియపరుస్తున్నాం. రెండు రోజుల క్రితం కలెక్టర్ కి ఈ విషయం పై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని రెడ్డి అప్పల నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు నిమ్మల శ్రీనివాసు, మహేష్, వల్లూరి రమేష్, ఈశ్వర్ రావు,బుధ్ధా నాగేశ్వరరావు, చీమల గోపి, ములికి శ్రీను, మజ్జి హేమంత్, మజ్జి శ్రీను స్థానిక నాయకులు కర్రా రాంబాబు, అంబటి చిరంజీవి, ఆలూరి కిషోర్, కోటి దానేలు, బుల్లి నాని, పెరుమాళ్ళ తంబి, నున్న ప్రభ, బూసే యేబు, దాకారపు రమేష్, దాకారపు రాము, రాజు, నాగరాజు, సాయి, మధు, రాజబాబు, గంగులు,తిరుపతి రావు వీర మహిళలు సరళ, ఉమా దుర్గా తదితరులు పాల్గొన్నారు.