ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 25 వ రోజు పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటకు విశేష స్పందన లభిస్తుందని రెడ్డి అప్పల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి రహిత సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. స్థానిక 39 వ డివిజన్లో నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు ఆధ్వర్యంలో పాదయాత్రను జన నీరాజనాల నడుమ ప్రారంభించారు. ఏలూరు నియోజకవర్గంలో నిర్విరామంగా పోరుబాటను నిర్వహిస్తున్నామన్నారు. 39 వ డివిజన్ లోని ప్రజలకు జనసేన పార్టీ సిద్దాంతాలను, ఆశయాలను వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని కోరారు. ప్రతి గడప వద్ద ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తున్నారన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో కుంటి సాకులు చెప్పి పథకాలను తొలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలన్నా, ఆంధ్ర రాష్ర్టం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి కలగాలన్న జనసేన పార్టీ తోనే సాధ్యమవుతుందని రెడ్డి అప్పల నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జూలై 15 నాటికి రాష్ట్రంలో ఒక గొయ్యి కూడా కనబడకుండా చేస్తానని జగన్ మోహన్ రెడ్డి మాటల వరకే పరిమితం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని సాహసాన్ని ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నారని చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు 30 కోట్ల రూపాయలను సొంత కష్టార్జితం నుండి తీసి వాళ్ళ కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున అలాగే వాళ్ళ పిల్లల చదువుల బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారని దానికి జనసేన పార్టీ కార్యకర్తలు సహాయ సహకారాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్నారని రెడ్డి అప్పల నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, మండల ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు అల్లు సాయి చరణ్ తేజ్, కందుకూరి ఈశ్వరరావు, బుద్ధా నాగేశ్వరరావు, కొనికి మహేష్, అగ్గాల శ్రీనివాస్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, కోలా శివ, స్థానిక నాయకులు వినోద్, సాయిరాంసింగ్, యు.ప్రసాద్, కె.జి.ప్రసాద్, కిషోర్, నందమూరి సాయి, వీర మహిళలు కావూరి వాణి, సరళ, ఉమా దుర్గా, సుజాత తదితరులు పాల్గొన్నారు.