తొలి రోజు ఆట ముగిసే సమయానికి 274/5 పరుగులు..

భారత్-ఆసీస్ మధ్య ఈరోజు ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మొదటి రోజు ముగిసింది. అయితే అనుభవం లేని బౌలర్లతో బరిలోకి దిగ్గిన భారత జట్టు పరుగులను కట్టడి చేసింది కానీ వికెట్లు త్వరగా సాధించలేకపోయింది. ఈ మొదటి రోజును తన ఖాతాలో వేసుకున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఇందులో లాబుస్చాగ్నే(108) సెంచరీతో రాణించారు. అయితే ఈ మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చగా 9వ ఓవర్లో మరో ఓపెనర్ మార్కస్ హారిస్ ను శార్దుల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. ఇక వాషింగ్టన్ సుందర్ ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (36) ను ఔట్ చేసాడు. ఆ తర్వాత వికెట్ ఇవ్వకుండా 113 పరుగుల భాగసౌమ్యంతో దూసుకపోతున్న లాబుస్చాగ్నే, మాథ్యూ వేడ్ లను వరుస ఓవర్లలో నటరాజన్ పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కామెరాన్ గ్రీన్(28), అలాగే టీమ్ పైన్(38) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. ఇక చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.