ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 29వ రోజు పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యల పై జనసేన పోరుబాటలో భాగంగా ఆదివారం స్థానిక 42 వ డివిజన్ కొత్తపేటలో అగ్గాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెడ్డి అప్పల నాయుడు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ కొత్తపేటలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని, కుంటి సాకులు చూపించి అర్హులైన వృద్ధులకు పెన్షన్లను తొలగిస్తున్నారని, రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే అని, రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యపై స్పందించిన తీరు విధానంపై ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దూషించుకోవడమే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా పాలనా యంత్రాంగం మరుగున పడేలా చేస్తున్నారని, రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు స్థాపన చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేక పరాయి రాష్ట్రాలకు తరలి పోతున్నారని, ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టివేస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు పరచాలంటే రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి కానీ ఏ ప్రక్కన చూసినా అప్పులే తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా నిలిచిపోతుందని, మరో ప్రక్కన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానాన్ని నిలబెడతానని చెప్పిన మాటను నిజం చేశారని, గంజాయి స్మగ్లింగ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు.‌ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్వి, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫాన్స్ ప్రెసిడెంట్ దోశపర్తి రాజు, జాయింట్ సెక్రటరీ ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, నాయకులు కందుకూరు ఈశ్వర్ రావు, పసుపులేటి దినేష్, నిమ్మల శ్రీనివాస్, పొన్నూరు రాము, దుర్గారావు, రెడ్డి గౌరి శంకర్, స్థానిక నాయకులు జనపరెడ్డి తేజ ప్రవీణ్, తాటపూడి చందు, మురళి, హరి, సతీష్, తిరుమల రావు, వీర మహిళలు కావూరి వాణి, సరళ, లంక ప్రభావతి, ఉమా దుర్గ, సుజాత తదితరులు పాల్గొన్నారు.