317 జి.ఓను రద్దు చేయాలి: ఆకుల సుమన్

హనుమకొండ న్యూస్, జి.ఓ 317ను రద్దు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో మొదలై 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అనుకున్నాం కానీ 317  జీ.ఓ తో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గలవారి ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం స్థానికత ఆధారంగానే చేయాలి. ఈ 317జి.ఓ వలన ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్తున్నారు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల సంఘాలతో ప్రతిపక్ష పార్టీలతో చర్చించి భదిలీలను చేయాలని కోరారు, 317జి.ఓ రద్దు చేసేవరకు జనసేన పార్టి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమలు చేపడతామని తెలిపారు.