జోగి రమేష్ మహిళలకు క్షమాపణ చెప్పాలి: ఎస్.వి.బాబు

  • బయటికి పొండి అంటూ మహిళలను కించపరిచిన జోగి
  • సమస్యలు చెబితే మంత్రికి అసహనమా?

పెడన: జోగి రమేష్ తాను ఒక ప్రజా ప్రతినిధినని మర్చిపోయి తాను పెడన నియోజకవర్గానికి రాజుల ఫీలవుతున్నాడు. రాజులు, రాజ్యాలు పోయి చాలా కాలమైంది మంత్రి గారూ.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలే ప్రభువులు. ఎంతటి నాయకుడైనా ప్రజల మాట వినవలసిందేనని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు ఎద్దేవా చేసారు. విషయానికి వస్తే.. పెడన పట్టణంలోని పైడమ్మ కాలనీ 2009లో ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు కరెంటు సౌకర్యం, సరైన రహదారి, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా అంధకారంలో మగ్గుతుంది. సొంత ఇంటి కల నెరవేర్దని ఆశతో అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వారు ఆశలు అడియాసలు అయ్యాయి. కళ్ళముందే తమ కలల సౌధం శిథిలమైపోతుంటే చూడలేని మహిళలు మంత్రి జోగి రమేష్ వద్ద తమ గోడు చెప్పుకుంటే, సమస్య తీర్చలేని మంత్రి మహిళను అవమానించడం తన పదవికే సిగ్గుచేటు. మంత్రి జోగి రమేష్ మహిళలకు క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. పైడమ్మ కాలనీ సమస్యలపై జనసేన పార్టీ అనేకసార్లు పోరాటాలు చేసి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. చేతకాని మంత్రి, నిస్సహాయులైన అధికారులు ఏమీ చేయలేకపోయారు. ఆడవాళ్లపై ఇరుసుకు పడే మీ ప్రతాపాన్ని వారి సమస్యలు తీర్చడంపై పెట్టండని ఎస్.వి బాబు హితవు పలికారు.