మండాది గ్రామంలో 33వ రోజు జనంతో జనసేన

  • కుమ్మరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

ఆముదాలవలస నియోజకవర్గం: ఆమదాలవలస మండలం, మండాది గ్రామంలో జనంతో జనసేన 33వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్లి సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, ఊర్లో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వార తెలుసుకొన్న ముఖ్యమైన సమస్య మండాది గ్రామంలో కుమ్మరి కుటుంబాల వారు ఎక్కువగా వున్నారు. తాతలు తండ్రుల నుంచి నేర్చుకున్న వృత్తిలో వారికి ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల, వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడం వలన, వేరే పనులు చేయలేక, కుటుంబాలు పోషించుకోలేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, ఆ కుటుంబాలను ఏదో విధంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున మనవి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయుకులు సంతోష్ నాయుడు, పృధ్వీ, కిరణ్, జయరామ్, వీరు, మహేష్, రుద్ర, ప్రదీప్, అనిల్, వినోద్, సాయి, మోహన్, కార్యకర్తలు మరియు మండాది గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేడం జరిగింది.