3వ రోజు కొనసాగుతున్న జనసేన దీక్ష

అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ అవనిగడ్డ నియోజక వర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష 3వ రోజుకు చేరుకుంది. శుక్రవారం మోపిదేవి మండల పార్టీ కార్యకర్తలు దీక్షలో కూర్చోగా, జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి రబ్బరు స్టాంపు ఎమ్మెల్యే ఈ రోడ్డు ను వేయించలేక పోయారని, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో గెలిచేది జనసేన పార్టీయేనని, వైసీపీ నాయకులు ప్రజలను ఎంత మభ్యపెట్టాలని చూసినా ప్రజలు తెలివైన వారని, మీ కుయుక్తులు ఇక చెల్లవని చెప్పారు. సీఎం జగన్ రెడ్డి 35 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పి 6 నెలలు అయినా దిక్కు లేదని, మాటలు చెప్పటమే కానీ చేతలలో చేయటం మీ వల్ల కాదని జనసేన పార్టీ శ్రేణులు ఎద్దేవా చేశారు. రెండు టిప్పర్లతో జె.సి.బి తీసుకువచ్చి, రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుంది అంటే నమ్మే ప్రజలు ఎవరు లేరని, ఈ రహదారి నిర్మాణం పూర్తి అయ్యేవరకు జనసైనికులు వివిధ రూపాలలో ఉద్యమం చేస్తూ, ప్రజలను మేల్కొలుపుతూనే ఉంటామని చెప్పారు. 35 కోట్లు నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే 50 లక్షలు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందని, ఇలా చేస్తే ప్రజలను తప్పు దారి పట్టించినట్లేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ కార్యదర్శి లంకే యుగంధర్, నూకల లక్ష్మయ్య, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు బచ్చు వెంకట్ నాథ్, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు మర్రి గంగయ్య, చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, కేతరాజు శ్రీనివాసరావు, మెరకనపల్లి నరేష్, కూరేటి రాఘవ, బాధర్ల లోలాక్షుడు, పెదకళ్లేపల్లి గ్రామ సర్పంచ్ అరజా సంధ్యారాణి, అర్జా రాధిక, ఆర్జా కిరణ్ కాంత్, భోగిరెడ్డి సాంబశివరావు, యర్రంశెట్టి సునీల్, చావాకుల సురేష్, మోపిదేవి మండల పార్టీ ఉపాధ్యక్షురాలు కొక్కికిగడ్డ ప్రభు కుమారి, మత్తి వంశీ, కొక్కిలిగడ్డ నవజీవన్, కోసూరు రామారావు, సనకా గోపాల్ కృష్ణ, బాచు శ్రీనివాసరావు, కేతరాజు రామకృష్ణ, రేపల్లె నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.