గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బొబ్బిలి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు జనసేన పార్టీ 11 వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్(బాబి) సమక్షంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. తరువాత పెద్ద ఎత్తున జనసైనికులతో జనసేన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు వీర మహిళలకి బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ (బాబీ) చేతుల మీదుగా పూల మొక్కలు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో బొబ్బిలి టౌన్ వైడ్ మెగా ఫ్యామిలీ ప్రెసిడెంట్ మరియు జనసేన సీనియర్ నాయకులు లంక రమేష్, రామభద్రపురం అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, వీర మహిళా బంటుపల్లి దివ్య, లక్ష్మి, జనసేన నాయకులు పైలా హరిప్రసాద్, చిక్కాల సందీప్, ఉల్లి సంతోష్ అల్లు రమేష్, సూర్యనారాయణ, జమ్ము గణేష్, గండేటి శ్రీనివాస్, అల్లాడ ధర్మ, పేకెటి సురేష్, అవినాష్, పూతి గౌరి శంకర్, శంబంగి వెంకటనాయుడు, లెంక శంకర్ రావు, మోకార శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.