టిడిపి నుండి జనసేనలోకి భారీగా చేరికలు

రాజానగరం: కోరుకొండ మండలం, కోటి కేశవరం గ్రామంలో టిడిపి పార్టీలో బలమైన క్యాడర్ ఉండి, గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి సర్పంచ్ గా పోటీ చేసిన ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వాకపల్లి రాజు స్థానిక టిడిపి ఇంచార్జ్ నిరాదరణ గురై సరైన గుర్తింపు, ఆదరణ లేకపోవడం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, అలానే నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ నియోజవర్గంలో నిర్విరామంగా విరివిగా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు జనసేన పార్టీని శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరుకు ఆకర్షితులై ఆదివారం వారు, వారి అనుచరగణం 40 మంది టిడిపి కార్యకర్తలతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోటి కేశవరం గ్రామ కమిటీ అధ్యక్షులు హరి, మద్దాల యేసుపాదం, మన్యం శ్రీను, బండి సత్య ప్రసాద్, కాండ్రేగుల పోసిరత్నజీరావు, కోటికేశవరం జనసేన యూత్, పెద్దలు, సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.