పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ యుగంధర్ పొన్న

  • ఒక్క గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా చేయలేని ఎమ్మెల్యే
  • ఒక్క గ్రామంలో కూడా మధ్యాన్ని నిలువరించలేని మంత్రి
  • రాష్ట్రం మీద పట్టులేని ఉప ముఖ్యమంత్రి
  • స్వామీ మాట్లాడుతుంటే దెయ్యం వేదాలు వల్లిఒచినట్లు ఉంది
  • జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, కార్వేటి నగరం మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామీ గడప గడప కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై, బోసు అయ్యవారి తోటలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న మాట్లాడుతూ… ఒక్క గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా చేయలేని ఎమ్మెల్యే, ఒక్క గ్రామంలో కూడా మధ్యాన్ని నిలువరించలేని మంత్రి, రాష్టం మీద పట్టులేని ఉప ముఖ్యమంత్రి స్వామీ మాట్లాడుతుంటే దెయ్యం వేదాలు వల్లిఒచినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామన్న భయంతో, జనసేన ఓడిస్తుందనే దిగులుతో, ఈసారి ఎమ్మెల్యే టికెట్ రాదనే ఫ్రస్టేషన్ తో కూడా ఉన్నారని తెలిపారు. నారాయణ స్వామికి మహిళలు అంటే ఎంత చులకనో ఈ నియోజకవర్గంలో ఉన్న వారు అర్ధం చేసుకోవాలని తెలిపారు. వైసీపీలో బాగా చదువుకున్న మహిళలు ఉన్నా, జడ్పీటీసీగా తన భార్యనే ఎంపిక చేసుకున్నారంటే, మహిళల మీద ఆయనకున్న గౌరవం ఏపాటిదని తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర స్త్రీ అభివృద్ధి ఆయనకు నచ్చదని, తన ఇంట్లో ఉన్నవారే రాజకీయంగా రాణించాలని స్వార్ధం కలిగిన వ్యక్తి నారాయణ స్వామని తెలియజేసారు. ఇదీ మీకున్న క్యారెక్టర్ అని ఎద్దేవా చేశారు. మద్యాన్ని అరికట్టి, మహిళలకు గౌరవం తీసుకురాలేని మీరు మహళల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతోందని తెలిపారు. మద్యాన్ని అరికట్టలేనివాడు మహిళను గౌరవిస్తాడు అంటే మహిళను అగౌరవ పరుస్తున్నాడని అర్ధం అని తెలిపారు. జడ్పీటీసీ గా భార్యను నామినేట్ చేసుకున్నవాడు మహిళలను గౌరవిస్తాడా? మహిళాభివృద్ధికి కృషి చేస్తాడా? మహిళా సాధికారతను తీసుకు వస్తాడా?? అసంభవమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారికి మా అధ్యక్షులు 30 కోట్ల రూపాయలు రైతు భరోసా యాత్రలో కుటుంబానికి సహాయం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. మీ మాటలను వెనక్కి తీసుకోకపోతే మీ ఇంటిని మూడు వేలమంది జనసైనికులతో ముట్టడిస్తామని తెలిపారు. 2009, 2014, 2019 నామినేషన్ లో మీరు పొందు పరచిన ఆస్తులు ఎంత? ఈరోజు మీ ఆస్తులు ఎంత పెరిగాయో మీరు నియోజకవర్గం ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని, తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీలోని ఆత్మాభిమానం, అసాధారణ ప్రతిభ ఉండి, మీతో ఉన్న నాయకులే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారని, మా గెలుపు సునాయాసమని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు
గౌరవ అధ్యక్షులు భానుచంద్రారెడ్డి, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, మండల నాయకులు రూప శేఖర్, ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, విజయ్, బుజ్జి, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, చంద్రమౌళి ,దేవేంద్ర, నరసింహులు, కార్యదర్శులు యుగంధర్ రెడ్డి, రూపేష్, చిరంజీవి, ఎస్ఆర్ పురం మండలం ఉపాధ్యక్షులు సుధాకర్, ఎస్ఆర్ పురం మండల కార్యదర్శి గిరి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు అనిల్, నవీన్, లోకేష్, దిలీప్, మురళి, తేజ పాల్గొన్నారు.