అందరికీ నాలుగు వేల పింఛన్

  • కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: కూటమి అధికారంలోకి రాగానే పింఛన్దారులందరికీ తమ ప్రభుత్వం నాలుగు వేలు పింఛన్ అందిస్తుంద ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో పల్లె పోరు కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టిందన్నారు. ప్రజల కోసమే కోటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నామని అందరూ ఆశీర్వదించాలని కోరారు. స్థానిక మంత్రి అభివృద్ధిని మరిచి సొంత గజాన్ని నింపుకునేందుకు అవినీతిలో రికార్డు సృష్టించారన్నారు. మంత్రిని సాగనంపెందుకు అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేజర్ ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.