పవనన్న ప్రజా బాట కార్యక్రమం 42 వ రోజు

ఒంటిమిట్ట: గురువారం పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 42 వ రోజు ఒంటిమిట్ట మండలంలోని, కొనమాచపల్లి పంచాయతీ లో తిరిగి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉండే ప్రజలు జగన్ చేసే అరాచకాలకు పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాసకార్యదర్శి రాటాల రామయ్య, జనసేన వీర మహిళలు, నరసమ్మ, గౌరీ, లక్ష్మీదేవి, సునీత, ప్రియాంక, లోక, మల్లేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొనడం జరిగినది.