పవనన్న ప్రజాబాట 45వ రోజు

ఆత్మకూరు, ఈనెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, భుధవారం 45వ రోజుకు చేరుకుంది. యువగళాన్ని వినిపించడమే లక్ష్యంగా ఈనెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీధర్ పిలుపునిచ్చారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పంటవీధి, తోట వీధి ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవనన్న ప్రజాబాట సాగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, నాగరాజు, ఆనంద్, భాను, మల్లికార్జున, వెంకట రమణయ్య,మణి, హజరత్ తదితరులు పాల్గొన్నారు.