కోరప కృష్ణాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజెరు మండలం, కోరప కృష్ణాపురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గ్రామ నాయకులు ఆల్తి రామారావు సిరిపురం సంతోష్ నాయుడు మరియు మురళి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.