సర్వేపల్లిలో జనంకోసం జనసేన 4వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిరుమలమ్మపాలెం పంచాయతీలోని గిరిజన కాలనీ నందు 4వ రోజైన శనివారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులలో చాలా కుటుంబాలకు ఇప్పటికే రేషన్ కార్డు లేవు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు లేని కుటుంబాలు ఉన్నాయి. సొంత ఇల్లు లేని కుటుంబాలు ఉన్నాయి. కనీసం పిల్లలకి వేసుకునే దానికి బట్టలు లేని గిరిజనులు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడిన కులాలలో అట్టడుగునున్నటువంటి గిరిజనులను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో వారిని ఆదుకోలేదు. గిరిజన సంక్షేమానికి వచ్చే నిధులు వారికి పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో కనీసం వంద నుంచి 150 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోతే ప్రతి కుటుంబానికి 10 కేజీలు లెక్కన బియ్యం అందించిన పార్టీ జనసేన పార్టీ. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులందరి పక్షాన నిలబడి పోరాడుతుంది. అదేవిధంగా వాళ్లందరికీ సొంత ఇల్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ప్రభుత్వం నుంచి అందే వరకు పోరాడుతుంది. జనసేన పార్టీ 2024లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గిరిజన కుటుంబానికి న్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరికీ కూడా మాటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీహరి, వెంకటేశ్వర్లు, ఎలీషా, బాలయ్య, ఆదిమూర్తి, శ్యాంసుందర్, కోటి, విజయ్, ఉదయ్, శ్రీనివాసులు, నూతన్, వెంకటేష్, పినిశెట్టి మల్లికార్జున్, రహీం తదితరులు పాల్గొన్నారు.