జనం కోసం జనసేన 508వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 508వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాండ్రేగుల మరియు గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 76200 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కాండ్రేగుల గ్రామం నుంచి కర్నాకుల మాణిక్యం, కర్నాకుల దుర్గాప్రసాద్, యాళ్ళ అప్పారావు, తాళ్లూరు గ్రామం నుండి ఆరుగోల్లు రామిరెడ్డి, కల్తూరి వెంకన్నబాబు, ఉమ్మిర్తి రమేష్, గొల్లపల్లి పవన్, అరిగెల వీర వెంకట లక్ష్మీ నారాయణ, చామనపల్లి నాగేంద్ర, పటాని నాని, చామనపల్లి వీరబాబు, నీలాపు తిరేష్, సిద్దాబత్తుల నాగేంద్ర, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), గోనేడ నుండి బుర్రే వీరభద్రరావు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, వెంగయ్యమ్మపురం నుండి మరిశే నాగేశ్వరరావు లకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాండ్రేగుల గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కర్ణాకుల దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు, కర్ణాకుల మాణిక్యం కుటుంబ సభ్యులకు, వరుపుల సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.