జనంలోకి జనసేనలో భాగంగా నిత్యావసర సరుకులు, క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన పెతకంశెట్టి

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, 91వ వార్డ్ పాత గోపాలపట్నంలో పశ్చిమ జనసేన నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ గత వారం జనంలోకి జనసేన పర్యటనలో భాగంగా రోడ్ ప్రమాదంలో గాయపడి జీవనోపాధి కోల్పోయిన పాము వేణును పరామర్శించి, నిత్యావసర సరుకులు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ ప్రకారం ఆదివారం వారికి నెలకి సరిపోయే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనుకులు శ్రీను, సాగర్, శంకర్ తదితరులు పాల్గొనడం జరిగింది. అలగే స్థానిక యువతకి క్రికెట్ కిట్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది.