కరకవలసలో ప్రభుత్వ కుళాయి మంజూరు చేయాలి: జనసేన డిమాండ్

*పి టి జి గ్రామం కరకవలసలో ప్రభుత్వం కుళాయి మంజూరు చేయాలి: జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, శ్రీరాములు, రామకృష్ణ

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరుకు నియోజకవర్గం, బొండం పంచాయతీ పరిధిలో గల కరకవలస పి టి జి గ్రామంలో మంచినీరు సదుపాయం కల్పించాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, మాదాల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినప్పటికీ నేటి వరకూ పి టి జి గ్రామం కరకవలసలో కుళాయి మంజూరు చేసి మంచి నీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ జగన్ రెడ్డి పాలనలో చూస్తున్నామని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఏదేమైనా ప్రభుత్వ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నీటి ఎద్దడి సమస్య గ్రామంలో నెలకొందని.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తక్షణ నీటి సమస్య పరిష్కారం చేయగలరని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. వేసవి కాలం రావడంతో బావి ఉన్నప్పటికీ నీరు ఇంకి పోవడంతో ఊరి చివర్లో ఉన్న పొలాల ఊట నీరు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని.. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం గిరిజనుల పట్ల ఏవిధంగా వ్యవహరిస్తుందో అర్థం అవుతుందని తెలిపారు. కోట్లాది రూపాయలు గిరిజన నులకి నిధులు కేటాయిస్తుందని చెప్పే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం నీటి ఎద్దడితో ఇటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని.. ప్రభుత్వ సంబంధిత అధికారులు గ్రామాలలో పర్యటిస్తే గా గిరిజనుల సమస్యలు తెలియడానికి అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే శుక్రవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మంచినీటి పరిష్కారం కోసం ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బావి వద్ద ఖాళీ బిందెలతో మంచినీరు సదుపాయం కల్పించాలని నినాదాలతో నిరసన మహిళలతో కార్యక్రమం చేపట్టారు. దీనికి ముందుగాను ఇంటింటికి జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు జనాల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బలియా గుడ గ్రామంలో పర్యటించి గిరిజనులతో సమావేశమై ప్రజా వ్యతిరేక ప్రభుత్వం విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జ్వర బాధితులు లైన సుబ్బారావుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.