జనసేన జెండా దిమ్మె శంకుస్థాపన

  • వీరఘట్టం మండలంలో జనసేన గిరిసేన 50వ రోజు

పాలకొండ: మన్యం పార్వతిపురం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో జనసేన టీమ్ తరపున చేపట్టే జనసేన గిరిసేన కార్యక్రమం 50వ రోజుకు చేరుకున్న సందర్బంగా వీరఘట్టం మండలం టౌన్ లో జనసేన జెండా ఆవిష్కరణ కోసం శంకుస్థాపన రెండు చోట్లా చెయ్యడం జరిగింది. కార్యక్రమంకి ముఖ్య అతిధిగా సీనియర్ రాజకీయ నాయుకులు గిరిజన నేత పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఎక్స్:జడ్పీటీసీ నిమ్మల నిబ్రమ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జానీ మాట్లాడుతూ.. ఈ రోజు వీరఘట్టాం టౌన్ సెంటర్ లో బిఎమ్ఆర్ చోట జెండా ఆవిష్కరణ కోసం టౌన్ టీమ్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అని ఈ జెండా ఆవిష్కరణ రోజు ఎప్పుడు అనేది తొందరలో అందరికి తెలియజేయ్యడం జరుగుతుంది కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మన్యం జిల్లాకి సంబందించిన జనసేన నాయుకులు జనసైనికులు వీరమహిళలు పాల్గొని విజయవంతం చెయ్యాలి అని కోరుకుంటున్నాను. జనసేన నాయకులు పాలకొండ నియోజకవర్గం సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ ఈ పాలకొండ నియోజకవర్గంలో స్థానిక వైస్సార్సీపీ నాయుకులు వీరఘట్టాం టౌన్ గురుంచి పట్టించుకోకపోవడం వల్లన ఇంకా రోడ్ పనులు పూర్తి కాకపోవడం వల్లన ప్రజలు వేపారస్థులు ప్రయాణికులు ఇబ్బందిలు పడుతూ ఆటో సోదరలు వాహనాలు కి రిపేరులు అధికమై వాళ్ళు ఖర్చులు పెరుగుతున్నాయి అని ఆవేదన వేక్తం చేసిన నిమ్మల నిబ్రమ్ వీరఘట్టం టౌన్ జనసేన నాయుకులు సరిపిళ్లి అచ్యుత్ రావు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలను, జరుగుతున్న అరాచక పాలన గురించి టౌన్ గ్రామస్థులకు ఇంటి ఇంటికి తెలియజేసే బాధ్యత జనసేన టీడీపీ నాయుకులుకు జనసైనికులకి కార్యకర్తలకి వీరమహిళలకి ఎంతో బాధ్యత ఉంది అని తెలియజేసిన సరిపిళ్లి అచ్యుత్ రావు ఈ కార్యక్రమంలో స్థానిక వీరఘట్టాం జనసేన నాయుకులు సైనికులు కర్నెన సాయిపవన్, ఉదయాన చరణ్, నందివాడ పండు, కనపాక విష్ణు, ప్రతాప్, చుక్క భార్గవ్, ప్రమోద్ పాల్గొని వారు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కి అండగా ఉంటామని ఈ సందర్బంగా భరోసా వారు భరోసాని ఇవ్వడం జరిగింది.