50వ డివిజన్ ఎమ్మార్సీ కాలనీలో సంకల్ప యాత్ర

  • జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది – రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: టిడిపి, జనసేన, బీజేపి కూటమి గెలుపు రాష్ట్ర భవిష్యత్తుకు గొప్ప మలుపు కానుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు.. ఏలూరు అసెంబ్లీలో విజయం రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే విధంగా కూటమికి భారీ మెజార్టీనిచ్చేందుకు ప్రతిఒక్కరూ సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.. గత ఓటమి వైరస్‌కు రానున్న ఎన్నికల్లో గెలుపు వ్యాక్సిన్‌ వేసేందుకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి శోధించి, సాధించిన దివ్యౌషధం ప్రజా సంకల్పయాత్ర.. ఈ కార్యక్రమం ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపుతోంది..ఆలోచనాత్మకంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కూటమి చేయనున్న పథకాలను బలంగా తీసుకువెళ్ళడంతో పాటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ప్రజామద్దతును కూడగట్టేందుకు ఉపయుక్తమవుతోంది.. ఇదే స్ఫూర్తితో తాజాగా ఏలూరు 50వ డివిజన్‌ లో ఉన్న ఎమ్మార్సీ కాలనీ లో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్ర కార్యక్రమంలో కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి తో పాటు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాం, కొట్టు మనోజ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు.. పూలజల్లులు కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. అనంతరం బడేటి చంటి ప్రజల వద్దకు నేరుగా వెళ్ళి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకు చరమగీతం పలికేందుకు సమయం ఆసన్నమైందని ఈ నెల 13వ తేదీన జరుగబోయే ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా బడేటి చంటి గారిని, ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు..ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, డివిజన్ ఇంచార్జీలు మడుగుల మాణిక్యాలరావు,తుమ్మపాల ఉమా దుర్గ, కార్యదర్శులు బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్,జనసేన రవి, పవన్, వేముల బాలు, సాయి రామ్ సింగ్, అల్లు సాయి చరణ్, వీర మహిళ దుర్గాబీబీ మరియు భారీ సంఖ్యలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు హాజరయ్యారు.