జనం కోసం జనసేన 528వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 528వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం వెదురుపాక మరియు బావాజీపేట గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 82660 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 529వ రోజు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం, రామకృష్ణాపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోశపాటి సుబ్బారావు, వెదురుపాక గ్రామం నుండి కండేల్లి జాను, ఆరుగొల్లి ప్రసన్నకుమార్, దుళ్ల చరణ్, బొట్ట నాని, మద్దాల ఆకాష్, కొల్లి వెంకటేశ్వర రావు, మద్దాల ప్రేమ్ కిరణ్, అరువల్లి భానుప్రసాద్, వేమగిరి నాగేశ్వరావు, వేమగిరి రవితేజ, బొట్ట శేఖర్, కొండ్రు శివ, కుమ్మర గణేష్, కొమ్మర నవీన్, గుత్తి శివ, దుంగల శివ, బావాజీపేట గ్రామం నుండి చుక్క వీరబాబు, కరణం సూర్యనారాయణ, బాసంశెట్టి గంగరాజు, కందికొండ దుర్గగణేష్, గొంతిన శ్రీను, బుదిరెడ్డి నాగేంద్ర, యలమంచిలి కృష్ణ భూపతి, అచ్యుతాపురం గ్రామం నుండి సోమరోతు రాధకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వెదురుపాక గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కవల రామకృష్ణ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.