జనం కోసం జనసేన 598వ రోజు

  • కామరాజుపేట గ్రామంలో జనం కోసం జనసేన

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 598వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 450 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 100360 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 599వ రోజు కార్యక్రమాన్ని ఆదివారం గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవి పేర్కొన్నారు. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, గోకవరం మండల కార్యదర్శి నీలం నాగేంద్ర, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కామరాజుపేట నుండి కరణం సూరిబాబు, నీలం నాని, జాజుల అశోక్, వెలిశెట్టి ప్రసాద్, పారుపల్లి సంతోష్ కుమార్, నీలం హరికృష్ణ, మెడిశెట్టి స్వామి, పాలేపు విజయ్, మనుతురు షణ్ముఖ, గోకవరం నుండి గవిని దుర్గాప్రసాద్, కొత్తపల్లి నుండి సోలా అంజిబాబు, మాదారపు ధర్మేంద్ర, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మదు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు.