మీతో మీ కార్పొరేటర్ 60 వ రోజు

విశాఖ దక్షిణ నియోజకవర్గం, అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో శుక్రవారం మీతో మీ కార్పొరేటర్ (సమస్యలపై కలసి పోరాడదాం) అనే కార్యక్రమంలో భాగంగా అరవై వ రోజుకి 3220 ఇళ్ళు సర్వే చేయడం జరిగింది. పెద్ద గొల్లల సందు, వెంకటేశ్వర మెట్ట, 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(జికె) పరివేక్షణ నిర్వహించబడింది. నాతో పాటు జనసైనికులు, వీరమహిళలు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని దక్షిణ నియోజకవర్గం జివిఎంసి ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ 33వ వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు.