జనసేన జన జాగృతి యాత్ర 69వ రోజు

  • జనసేన పార్టీ విజయానికి జనసేన జన జాగృతి యాత్ర కీలక పాత్ర పోషిస్తుంది.. “మేడ”
  • గురుదత్ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలో దిగ్విజయంగా మజ్జిగ పంపిణి కార్యక్రమం ముందుకు సాగుతుంది
  • ఉదయాన్నే…. శ్రీరంగపట్నం గ్రామ ఉపాధి హామీ రైతుకూలిలతో ముఖాముఖి కార్యక్రమంలో గురుదత్

రాజానగరం నియోజకవర్గం: జనసేన జనజాగృతి యాత్ర 69వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలిలను శుక్రవారం ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి వెళ్లి, వారి వారి గ్రామంలో ఉన్న సమస్యలు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రైతులకు చేసిన మేలుగురించి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా..జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ 400మందికి రైతుకూలిలకు మేడ గురుదత్ ప్రసాద్ మజ్జిగ పంపిణి చేసారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా శ్రీరంగపట్నంలో ఏ ఒక్కరికి కూడా జగన్ అన్న ఇళ్ల స్థలాలు కేటాయించలేదని కనీసం, పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు, అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి ఎన్ని సార్లు చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదు. జనసేన పార్టీ తరఫున గురుదత్ గారు మీరు మాకు అండగా ఉండండి మీకు మీ అండగా ఉంటామని ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గురుదత్ ప్రసాద్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్న ప్రధానమైన సమస్య జగనన్న ఇల్లు వీటిపై #జగనన్నమోసం కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అప్పుడు రాజానగరం నియోజవర్గంలో అనేక చోట్ల జగనన్న ఇళ్ల స్థలాల్లో ఆవకతవకలు మన పార్టీ దృష్టికి వచ్చాయి. అవి అధిష్టానం కూడా పంపించడం జరిగింది. ఇస్తామన్నారు కానీ ఇప్పటికీ స్థలం ఇవ్వలేదంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, కోరుకొండ మండల ప్రధాన కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, అడపా అంజి, గొల్లకోటి కృష్ణ, తన్నీరు తాతాజీ, అప్పారావు, కామేష్ మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.