జనం కోసం జనసేన మహాయజ్ఞం 707వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 707వ రోజు కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 708వ రోజు కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ నందు జనసేన-టిడిపి పార్టీల ఆత్మీయ సమావేశం జరుగును. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, నల్ల శివ, గంటా దుర్గాప్రసాద్, అడబాల వీరబాబు, చిట్టీడి స్వామి, కర్రి బాబ్జి, సొడబత్తుల సత్యనారాయణ, చిట్టీడి శివరామ్, ప్రగడ సత్యప్రసాద్, యడాల సత్తిబాబు, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, సగరపేట నుండి గండికోట బాలాజీ, సోమవరం నుండి డేగల నరేష్, గెంజి శివ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, పిన్నం మణికంఠ ఏలేశ్వరం నుండి ఉగ్గిరాల శ్రీను లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కర్రి బాబ్జి కుటుంబ సభ్యులకు, కొండేపూడి వీరబాబు గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.