పలుకుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల దంపతులు

  • ఏడిద సూరికి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం

రాజానగరం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో పెరాలసిస్ వలన బాధ పడుతున్న ఏడిద సూరిని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి అతని వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసైనికుల చేతుల మీదుగా అందించడం జరిగింది.

  • దార్ల అరవరాజుకి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం

సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న దార్ల అరవరాజుని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి ఆరోగ్య స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతని వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసైనికుల చేతుల మీదుగా అందించడం జరిగింది.

  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 10,000 ఆర్ధికసాయం

సీతానగరం మండలం, రాజంపేట గ్రామం చెందిన రైతు దుళ్ళ వీరబాబు వ్యవసాయం వలన అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఆయన మరణంతో కుటుంబం మరింత దిగ్బ్రాంతికి లోనై జీవనాన్ని సాగిస్తున్నారు. సీతానగరం మండలం జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రాజంపేటలోని వీరబాబు స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబ‌ సభ్యులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతానగరం జనసైనికుల చేతుల మీదుగా 10,000 ఆర్థిక సహాయాన్ని వీరబాబు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

  • తడికొప్పుల సుబ్బారావుకి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం

సీతానగరం మండలం, కూనవరం గ్రామానికి చెందిన తడికొప్పుల సుబ్బారావు ఇటీవల ఆక్సిడెంట్ గురి కావడంతో పక్కటెముకలు చిట్లడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకుని 5000/- ఆర్థిక సహాయం అందించిన బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి.

  • తంబాబత్తుల నారాయడుకి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం

సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన తంబాబత్తుల నారాయడు ఇటీవల ఆక్సిడెంట్ కి గురికావడంతో వైద్యం చేయించుకుంటున్నారు. ఈ సమస్యని జనసైనికులు రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీ‌సుకొచ్చారు. కూనవరంలోని నారాయడు గృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసైనికుల చేతుల మీదుగా 5000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో పెరాలసిస్ వలన బాధ పడుతున్న సొంగా సూరిబాబు ఈ మధ్యనే తుది శ్వాస విడవడం జరిగింది. సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం సూరిబాబుకి జనసైనికుల మధ్య, సూరిబాబు నివాసం వద్ద నివాళులు అర్పించడం జరిగింది.

సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామ వాస్తవ్యురాలు బుర్ల లక్ష్మీ నరసమ్మ ఈ మధ్యకాలంలో తుది శ్వాస విడవడం జరిగింది. సీతానగరం మండలం జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి నరసమ్మ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్వర్గస్తులైన నరేంద్రపురం గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ గట్టెం పెద్దకాపు కుటుంబాన్ని శనివారం రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది.

ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా స్వర్గస్తులైన నరేంద్రపురం గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ ప్రగడ వాసు కుటుంబాన్ని శనివారం రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది.

నందరాడ వాస్తవ్యుడు చిక్కిరెడ్డి సత్యనారాయణ తల్లి లక్ష్మీకాంతం ఇటీవల కాలంలో మరణించారు. జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సత్యనారాయణని పరామర్శించి లక్ష్మీకాంతంకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందరాడ గ్రామ జనసేన శ్రేణులు సోలా సతీష్, బాదం రమణ పాల్గొన్నారు.

లంకూరు గ్రామ వాస్తవ్యుడు మట్ట సుబ్రహ్మణ్యం తల్లి మట్ట మంగాయమ్మ ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు జారి పడి చికిత్స పొందుతున్నారు. సీతానగరం మండలం జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సుబ్రహ్మణ్యం తల్లిని పరామర్శించి సంఘటన జరిగిన వివరాలను తెలుసుకుని ఆమె త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు‌. ఈ కార్యక్రమంలో లంకూరు జనసైనికులు, సీతానగరం మండల జనసేన శ్రేణులు మట్ట వెంకటేశ్వరరావు, దాసరి కోటేశ్వరరావు, కోనే శ్రీను, గడగట్టి ప్రశాంత్ కుమార్, ముత్యాల హరీష్, మోహన్ పి.ఎస్.పి.కె, మాధవరావు, వీరభద్రరావు, రొంగలి అభిరామ్ నాయుడు, కొండటి సత్యనారాయణ, మట్ట సుబ్రహ్మణ్యం, మాధవరం కోటేశ్వరరావు, అడపా నరసింహ, కవాళ్ళ సురేష్, ప్రగడ శ్రీహరి, మూర్తి, బైలపూడి శ్రీను, సందీప్ ముగ్గుల, రుద్ర నాగు, బాషా, బ్రహ్మ లతో పాటు నియోజకవర్గ జనసేన శ్రేణులు గల్లా రంగా, వేగిశెట్టి రాజు, నాతిపాము దొర, అరిగెల రామకృష్ణ, గాడాల జనసైనికులు, చిట్టిప్రోలు సత్తిబాబు, కమిడి సత్యనారాయణ, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అడబాల సత్యనారాయణ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.