ఏజెన్సీ వ్యాప్తంగా పనిచేస్తున్న 708 మంది బాషా వాలంటీర్ టీచర్లను రెన్యువల్ చేయాలి: మాదాల శ్రీరాములు

పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న బాషా వాలంటీర్ టీచర్లను రెన్యువల్ చేయాలని జనసేన డిమాండ్ చేసింది. మాదాల శ్రీరాములు మాట్లాడతూ… ఆదివాసి మాతృభాష వాలంటీర్లు విద్యాభివృధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, వారి ద్వారా ప్రాధమీక విద్యా బలోపేతం జరుగుతుందని తక్షణమే రెన్యూవల్ చేయాలనీ కోరారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా క్ర్ పురం ఐటిడి ఏ పరిధిలో 101 మందిని రెన్యువల్ చేసారని గుర్తు చేసారు.
సొంత భాషలో చదువు చెప్పడఒ ద్వారా సులువుగా గిరిజన విద్యార్థులకు విద్య ను నేర్చుకుంటున్నారు. తక్షణమే బాషా వాలంటీర్లను రెన్యువల్ చేస్తే విద్యా ప్రమాణాలు, అక్షరాస్యత పెరుగుతుందిని అన్నారు. అరకు, పాడేరు ఎమ్మెల్యేల, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, అరకు ఎంపీలు స్పందించి సమస్య పరిస్కారం చేయాలని డిమాండ్ చేశారు పాడేరు ఐటిడిఏ పిఓ గోపాలకృష్ణ వైఖరి బాషా వాలంటీర్లకు శాపంగా తయారయ్యిందని, రాష్ట్ర వైసీపీ జగన్ ప్రభుత్వం, పాడేరు పిఓ వైఖరి సరిగ్గా లేదని ఈ సందర్భముగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.