ప్రజలందరికీ దగ్గరయ్యేందుకే జనసేన మహాపాదయాత్ర: బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకే జనసేన మహా పాదయాత్ర చేపట్టిందని సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. మండలంలోని కొమరపూడి గ్రామం నుండి గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా రైతులు, రైతు కూలీలు సామాన్య ప్రజలు ఆయా కులవృత్తుల వారితో మమేకమై జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ముందుకు సాగడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా కొమెరపూడి ఆంజనేయ స్వామి గుడిలో, ఎర్రగుంటపాడు నాగేంద్ర స్వామి గుడిలో పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు. జనసేన-టిడిపి అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించడం జరిగింది. పాదయాత్రకు అడుగడుగున జనసేన, టిడిపి నాయకుల నీరాజనాలు పలికారు. కొమెరపూడి నుండి కొనసాగిన జనసేన మహాపాదయాత్ర. ఎర్రగుంటపాడు మీదుగా గార్లపాడు మీదుగా సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడి వరకు చేరుకున్నారు చేరుకున్న జనసేన మహాపాదయాత్ర. గురువారం 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, జనసేన నాయకులు. ఈ పాదయాత్రలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తెనపల్లి మండలం షేక్ రఫీ, చిలకా పూర్ణ, గంజి నాగరాజు, మాజీ ఎంపీటీసీ శివ, తోట రామాంజినేయులు, షేక్ కన్నా, సురేష్, ఏసుబాబు, రుద్రజడ ఆంజనేయులు, రుద్రజాడ బుల్లి అబ్బాయి, శేషు, పసుపులేటి వేంకటేశ్వర్లు, పోకల శ్రీను, షేక్ రఫీ, పసుపులేటి మురళి, నక్క వెంకటేశ్వర్లు, షేక్ మీరవలి, కొడమల శ్రీను , నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, మెద్దెం మహాలక్ష్మి, అంకారావు, నాయకులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.