లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అనంతపురం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు అడ్వకేట్ బార్ అసోసియేషన్ సభ్యులు జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. అనంతపురం జిల్లా న్యాయమూర్తి మరియు సీనియర్ న్యాయవాది పి.గురుప్రసాద్ అనంతపురం జిల్లా బార్ అసోసియేషన్ నాయివాదుల పర్యవేక్షణలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 మంది అనాధ వృద్ధులకు వితరణ (చిరు సహకారం) అందించడం జరిగింది.