రామాపురం గిరిజన గ్రామంలో 7వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ వీరఘట్టం మండలం, గంగంపేట పంచాయతీ రామాపురం గిరిజన గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 7వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమం. ప్రజా సమస్యలు, గ్రామ సమస్యలు ఇంటింటికీ తిరిగి తెలుసుకుంటున్న వీరఘట్టం మండలం జనసైనికులు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరింది. ఎం.యల్.ఎలు, మంత్రులు, సీఎం సమస్యల మీద స్పందించడమే మానేశారు. అవినీతి నీ ప్రోత్సహిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను ఏం చేస్తున్నారో తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు లేవు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే కోట్లాది రూపాయలు ఏమవుతున్నాయి అని మత్స పుండరీకం ప్రశ్నించారు. జనసేన జాని మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి రాయితీలు రాకుండా చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా చేశారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారు. అర్హులైన వారికి విద్యుత్ బిల్లు సాకు చూపించి వారి పెన్షన్లు, పథకాలు తొలగిస్తున్నారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ధనిక అని తేడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో సమస్యలు కనిపిస్తున్నాయి అని ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన సమస్య ఉందని ఆయన తెలిపారు. ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నారని సాయి పవన్ అన్నారు. రాజు మాట్లాడుతూ గ్రామ గ్రామాన జనసేన పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి వెంకటరావు నాయుడు, దూసి ప్రణీత్, అన్ను రామకృష్ణ, కంటు మురళి తదితరులు పాల్గొన్నారు.