జనంకోసం జనసేన – మహాపాదయాత్ర 85వ రోజు

  • అందరి నోటా ఒకటే మాట ఈసారి పవన్ కళ్యాణ్ కి కూడా ఒక అవకాశం ఇచ్చి ఇస్తాం.
  • ప్రజల విశేష ఆదరణతో దూసుకుపోతున్న “మహాపాదయాత్ర”
  • సంపత్ నగరం గ్రామంలో సుదీర్ఘంగా కొనసాగిన ఆడపడుచులకు బొట్టుపెట్టె కార్యక్రమం.
  • వైసిపి అసమర్థత పాలన వల్లే రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు
  • మాట తప్పడం మడమ తిప్పడం ఈ అసమర్థ ముఖ్యమంత్రి నైజం.
  • దేశానికి వెన్నుముక రైతన్న, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు.
  • ప్రణాళిక బద్ధమైన సుస్థిర అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యం…
  • మచిలీపట్నం వేదికగా జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం.

రాజానగరం “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” ఆడపడుచులు బొట్టు పెట్టే కార్యక్రమం… రాజానగరం మండలం, సంపత్ నగరం గ్రామంలో రెండవ రోజు గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ఉత్సాహంగా రాత్రిపూట సైతం సుదీర్ఘంగా కొనసాగింది. రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వీరమహిళలు జనసైనికుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి గడప ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ, కరపత్రాలు పంచుతూ ఉత్సాహంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ “ఆడపడుచులకు బొట్టు బొట్టే కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతం కావడం సంతోషంగా ఉందని, ఈసారి నియోజకవర్గం ఏ గ్రామంలో చూసినా ప్రజలందరూ ముక్తకంఠంతో ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసూచకమని, నియోజవర్గంలో పెద్దఎత్తున రైతులు వ్యవసాయం చేస్తున్నారని, రైతు దేవుళ్ళ రుణం తీర్చుకోలేనిదని, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, రైతు పురోభివృద్ధికి జనసేన పార్టీ సహకరిస్తుందని, ఈ అసమర్థత ముఖ్యమంత్రి పాలన ఎంత తొందరగా పోతే రాష్ట్రానికి అంత మంచిదని, ఈరోజు రాష్ట్రంలో చాలా దారుణమైన దుర్పర పరిస్థితులు నెలకొన్నాయని, ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ప్రగల్బాలు పలుకుతున్న ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నియోజవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఓటమి భయంతో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీకి పెద్దపేట వేస్తూ అభివృద్ధిని అటకెక్కించారని, దోచుకున్నోడికి దోచుకున్నంత మాదిరిగా సహజ వనరులను యదేచ్ఛగా కొల్లగొడుతూ అడ్డదారుల్లో కోట్లు దండుకుంటున్నారని, నియోజకవర్గంలో వీళ్ళ అరాచకాలు, సెటిల్మెంట్స్ రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయని, వీళ్ళకు రాజానగరం నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నానని, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ప్రజలందరూ జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజల శ్రేయస్సు కాంక్షించే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి తద్వారా ప్రజా పరిపాలన తీసుకొద్దామని, మహా పాదయాత్రకు సహకరిస్తున్న వీరమహిళలకు, జనసైనికులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రాత్రి 10:30 వరకు ఉధృతంగా కొనసాగిన ఈ మహాపాదయాత్రలో సంపత్ నగరం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.