శ్రీరామవరం గ్రామంలో జనం కోసం జనసేన 89వ రోజు

టీ నర్సాపురం మండలం, శ్రీరామవరం గ్రామంలో సోమవారం మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 89వ రోజు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు గ్రామస్థులు పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ చిర్రి బాలరాజుకి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తూ ప్రజలను కలుస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటున్నారు. శ్రీరామవరం గ్రామస్తులు చిర్రి బాలరాజుకి భ్రమరధం పెట్టారు, అధికార ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రభుత్వ పథకాల గురించి తిరుగుతున్నాడు తప్పించి కనీసం ఏ రోజు కూడా మండల సమస్యల గురించి గానీ గ్రామ సమస్యల గురించి గానీ ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవని, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న అధికారులు అలాగే అధికారం నాయకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 89 రోజుల జనం కోసం జనసేన కార్యక్రమంలో ఏ గ్రామానికి ఏ మండలంలోకి వెళ్లిన కనీసం ప్రతి చోట సమస్యల గురించి చెప్పుకోవడమే తప్ప ఎక్కడ పరిష్కరించినట్టు ఎక్కడ ఏమి లేదని చిర్రి బాలరాజు మండిపడ్డారు. ప్రజలను బాధపెట్టి ప్రభుత్వం ఏం సాధిద్దామనుకుంటుందని, యువతకు విద్య, ఉద్యోగం రావాలన్న, నియోజకవర్గ, మండల, గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా కచ్చితంగా జనసేన రావాల్సిందే అని, ఒక్క అవకాశం ఇస్తే పరిపాలన ఏంటో చేసి చూపిస్తామని, ఇక్కడ నియోజకవర్గంలో, రాష్ట్రంలో జనసేన పార్టీ నేను గెలిపించుకొని మన భవిష్యత్తు తలరాత మనమే మార్చుకుందామని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తేనే సాధ్యమని, నాలాంటి ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారానే ఆయన ముఖ్యమంత్రి కాగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల బాలాజీ, సింగులూరి దొరబాబు, పూనెం ఆదిత్య, రాఘవరాజు సురేష్, సాయిలా వెంకట్, గన్నిశెట్టి రాజేష్, కల్నిడు మురళి, లక్ష్మనరావు, జబ్బా నాగరాజు, యువరాజు తదితరులు పాల్గొన్నారు.