10వ తరగతి పతనం ప్రభుత్వ పనితనమే: జమ్ము ఆదినారాయణ

ఏపీ లో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.. పరీక్షా ఫలితాలపై జనసేన నాయకులు జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ.. యావత్ రాష్ట్రంలో పూర్తిగా సుమారు 20, 22 ఏళ్ల క్రితం వచ్చిన రిజల్ట్స్ ఈ 2022 తో సమానం.. అందుకు కారణం విద్యావ్యవస్థలో మార్పులు. ఆలోచన లేని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.. అవగాహన లేని విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు.. ఒక వాహన ప్రయాణంలో స్థిరమైన డ్రైవర్ లేకపోతే ఆ ప్రయాణం ఎంత ప్రమాదమో.. అవగాహన లేని వ్యక్తులు అధికారం తీసుకుంటే అంతకన్నా ఎక్కువ ప్రమాదం. ఉపాద్యాయ వ్యవస్థని వాచ్ మెన్ లా.. పని మనుషులు కన్నా హీనంగా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి నాడు నేడు పనుల్లో అటెండర్ కన్నా హీనంగా చూస్తున్నారు.. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నేను 2019 ఎన్నికల్లో ఎం.ఎల్.ఎ గా పోటీచేసినప్పుడు ఎన్నో గ్రామాల్లో చెప్పా తన తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తిని కాపాడుకోలేక పదిహేడేళ్ల జైల్లో ఉన్న వ్యక్తి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా కాపాడగలడు. పూర్వం లిక్కర్ మాఫియా చేసిన వ్యక్తి (వారుణి వాహిని ప్యాకెట్లు) అమ్ముకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయితే ఓల్డ్ మందు ప్యాకెట్లు మాదిరిగా పేపర్లు అమ్ముకుంటే…? పదవ తరగతి రిజల్ట్ డేట్ మార్చక ఏం చేయాలి..? ఇంతవరకు ఎప్పుడైనా రిజల్ట్ రిలీజ్ చేస్తామని పోస్ట్ఫోన్ చేసిన రోజులు ఉన్నాయా..? గణితం లో 17 మార్కులు.. సోషల్ స్టడీస్ లు 11 మార్కులకే ఉత్తీర్ణత ఎక్కడైనా విన్నారా.. వీటన్నింటికి నిదర్శనం నేటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మరియు బొత్స సత్యనారాయణ ఆస్తులు పెరిగాయి తప్ప… ఆలోచనలు పెరగవు.. దీనిని ప్రజలు ఎప్పుడో గమనించారు. వీరిద్దరిని ప్రజలు ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందని ప్రజల్లో ఆ నోటా ఈ నోటా చాలా బలంగా వినిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిగా తవిటి నాయుడు, దన్నాన యేసు, ఆర్మీ మూర్తి పాల్గొన్నారు.