మహిళకి ఆపరేషన్ చేయించిన 91 వార్డ్ జనసైనికులు

విశాఖపట్నం, 91 వార్డ్ పాత గోపాలపట్నంకి చెందిన మహిళా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కాలు ఇన్ఫెక్షన్ అయింది ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెబితే ఆ సమయానికి వారి దగ్గర ఏమి డబ్బులు లేవు అని ఒక జనసైనికుడి ద్వారా జనసేన నరేంద్రకి తెలియజేయగా ఆయన వెంటనే 91వార్డ్ లో ఉన్న జనసైనికులు అందరికి పిలుపునివ్వగా అందరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు ఆ మహిళకి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఆ మహిళను పరామర్శించడానికి వచ్చి వీర మహిళ లత నెలకి సరిపడ సరుకులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగరాజు, శేషు, గిరి, అప్పలరాజు, రవి, శివ, శివ సాయి, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.