ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి.. జనసైనికుల వినతి పత్రం

గోపాలపట్నం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన ప్రయాణికుల సిటీ బస్ స్టాప్ కు వెళ్లటానికి బి ఆర్ టి సి రోడ్డు క్రాసింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. అందువలన నాయుడు తోట దగ్గర ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించుకోవట్లేదు కావున ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇక్కడికి మార్చవలసిందిగా లేదా కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అదేవిధంగా గోపాలపట్నం హైస్కూల్ దగ్గర కూడా పిల్లలు రోడ్డు క్రాస్ చేయుటకు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల అక్కడ కూడా ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని వేపగుంట జోన్ 8 జీవీఎంసీ కమిషనర్ ని కోరడం జరిగింది. గోపాలపట్నంలో ఉండే కొన్ని మాల్స్ పార్కింగ్ సదుపాయం కల్పించట్లేదు అందువలన కూడా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. దీనివల్ల వాహన చోదకలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని మరియు ముఖ్యంగా గోపాలపట్నం నుండి ఎన్ఏడి వరకు ట్రాఫిక్ అంతరాయం బాగా జరుగుతుంది కావున బీఆర్టీసీ దారిలో కూడా వేరే ఇతర భారీ వాహనములు పోవుటకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అనుమతిని ఇవ్వవలసిందిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు పవన్ఆనంద్, కనకరాజు, నరేంద్ర రమణ, ఆనంద్, సురేష్, నాయుడు వినతి పత్రాన్ని ఇచ్చినారు. దీనికి జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ పాజిటివ్ గా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.