పరింపూడి గ్రామంలో జనం కోసం జనసేన 98వ రోజు

పోలవరం నియోజకవర్గం: కొయ్యలగూడెం మండలం, పరింపూడి గ్రామంలో 98వ రోజు మండల అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలు ఎన్నో ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ ఘోరమైన స్థాయిలో ఉన్నదని, వర్షాకాలం, శీతాకాలంలో పడే అవస్థలు ఒక్క అధికారి గాని ఒక్క నాయకులకు గాని పట్టడం లేదని ఉచితంగా వచ్చి ఇసుకను కూడా అమ్ముకొని ఆర్థికంగా వెనుకబడిన వారిని మరింత ఇబ్బంది పెట్టే విధంగా ఉందని వారి బాధను చిర్రి బాలరాజు గారికి వివరించారు. గ్రామస్తులు ఇన్ని బాధలు పడుతుంటే కనీసం ఒక్క అధికారి ఒక నాయకులు కూడా రాకపోవడం ఏంటని బాలరాజు గారు మండిపడ్డారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా కోరారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేలా చూసుకునే బాధ్యత తీసుకుంటామమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగడా రమేష్, ఏపూరి సతీష్, గొలిసెట్టి శీను, చెప్పుల మధు, వామిశెట్టి మధు, అడపా వెంకట శ్రీను, మెడిన కన్నయ్య, చోడిపిండి సుబ్రహ్మణ్యం, సంకు మధు, పనిందల విజయ్ కుమార్, మందపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.