“కౌలురైతు భరోసా యాత్ర” కు వస్తున్న విశేష స్పందనకు వైసీపీ నేతల్లో అలజడి

గుంతకల్, జనసేనాని పవన్ కళ్యాణ్ పై గుంతకల్ శాసనసభ్యులు వెంకట్రామ్ రెడ్డి చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గుంతకల్ నియోజకవర్గ జనసేన నాయకులు. ఈ సందర్భంగా గుంతకల్ పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న మూడు వేల మంది కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మొదటి విడతగా 5 కోట్ల తన సొంత నిధులను వెచ్చించి ఒక్కొక్క కౌలురైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా మేమున్నామని “కౌలురైతు భరోసా యాత్ర” మొదలెట్టినప్పుడు నుండి ఆ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన రావడంతో వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. అప్పటినుండి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వైసిపి నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మరీ ముఖ్యంగా గుంతకల్ గౌరవ శాసనసభ్యులు, వైసిపి కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన చౌకబారు విమర్శలను ఖండించారు, మా నాయకుడు ప్యాకేజీ తీసుకుని ఉంటే ప్రభుత్వం మీది, పోలీసులు మీ వాళ్ళు నిరూపించండి లేదా అర్థంలేని విమర్శలు మానుకోండి అని హితవు పలికారు. పామిడి మండలం నీలూరు మరియు కొండాపురం గ్రామ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సంవత్సరాలు గడుస్తున్న ఆదుకున్న పాపాన పోలేదు మీరు, మీ ప్రభుత్వం కానీ మా నాయకుడు మనీలా గ్రామంలో జరిగిన “కౌలురైతు భరోసా యాత్ర” లో ఆ రెండు కుటుంబాకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున సహాయం చేసి భరోసా కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే అయినా మీరు మాత్రం చేసింది శూన్యం. ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద బాధ్యత లేని మీరెక్కడ సామాజిక బాధ్యతతో ఆపదలో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తన సొంత నిధులు 30 కోట్ల రూపాయలు దానం చేసి భరోసా కల్పిస్తున్న మా నాయకుడు ఎక్కడ ఇకనైనా ఇలాంటి చౌకబారు రాజకీయ విమర్శలు పక్కనపెట్టి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిపై దృష్టి సారించండి లేదా రాబోయే ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని గద్దె దింపి మీకు తగినశాస్తి చేస్తారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్, గుంతకల్, గుత్తి, పామిడి మండలాధ్యక్షులు కురువ పురుషోత్తం, పోతురాజుల చిన్న వెంకటేశులు, ఎం.ధనుంజయ్ వీరమహిళ సంధ్య, ఈరమ్మ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శేఖర్, సుబ్బయ్య, బోయ సురేష్, పాండు కుమార్, వీరేశ్, విజయ్ కుమార్ జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్.కృష్ణ, సోహెల్ నిస్వార్థ జనసైనికులు మధు, జిలాన్, మంజునాథ్, జగదీష్, అమర్ తదితరులు పాల్గొన్నారు.